జగన్ దెబ్బకు టీడీపీ మూడు ముక్కులు…

జగన్ దెబ్బకు టీడీపీ మూడు ముక్కులు...

0
89

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దెబ్బకి తెలుగుదేశం పార్టీ మూడు ముక్కలు అయిందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు… ఇదే విషయాన్ని వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకూడా అన్నారు…

తాజాగా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… రాజధాని విషయంలో టీడీపీ మూడు ముక్కలు అయిందని తెలిపారు… ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు మాటలకు చంద్రబాబు నాయుడు తల ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాకుందని అన్నారు….

అలాగే రాయలసీమ ప్రాంతానికి చెందిన టీడీపీ నేతలు కూడా జగన్ మూడు రాజధానులు ప్రతిపాధనకు జై కొట్టారని అన్నారు… అయితే చంద్రబాబు నాయుడు ఆయన కుమారుడు రాద్దంతం చేస్తున్నారని మల్లాది విష్ణు ఆరోపించారు… రాజధాని రైతులు ఆందోళ చెందాల్సిన అవసరం లేదని అన్నారు… వైసీపీ రైతుల పక్షాన పార్టీ అని అన్నారు…