మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు త్వరలో మరో బిగ్ షాక్ తగిలే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి… ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే అశోక్ రెడ్డి వైసీపీలో చేరాలని భావిస్తున్నారు… అంతేకాదు జగన్ సైతం పార్టీలో చేరేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి…
2014 ఎన్నికల్లో వైసీపీ తరపున గిద్దలూరు నుంచి పోటీ చేసి గెలిచారు.. ఆ ఎన్నికల్లో వైసీపీ ప్రతిపక్షంలో చేరడంతో ఆయన టీడీపీలో చేరి ఫిరాయింపు ఎమ్మెల్యేగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక టీడీపీలో ఉన్న అన్నా రాంబాబు వైసీపీలో చేరాలు… దీంతో 2019 ఎన్నికల్లో సీన్ రివర్స్ అయింది…
టీడీపీ తరపున అశోక్ రెడ్డి పోటీ చేయగా వైసీపీ నుంచి అన్నారాంబాబు పోటీ చేసి భారీ మెజార్టీతో గెలిచారు… ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ వేవ్ కనిపిస్తున్న నేపథ్యంలో అశోక్ రెడ్డి కూడా వైసీపీలో చేరాలని భావిస్తున్నారు… జిల్లానుంచి ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీలో చేరాలని భావిస్తున్నారు… వారు వైసీపీలో చేరే లోపు తాను ముందుగా వైసీపీ కండువాను కప్పుకోవాలని అశోక్ రెడ్డి భావిస్తున్నారు…