జగన్ ఓడిపోతే జరిగేది ఇదే

జగన్ ఓడిపోతే జరిగేది ఇదే

0
102

ఏపీ ఎన్నికల ఫలితాలపై ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది, ఎవరు విన్నర్ ఎవరు లూజర్ ఎవరు కింగ్ మేకర్ అనే విషయంలో పెద్ద ఎత్తున ఆలోచనలు చేస్తున్నారు..ఏపీ ఎన్నికల్లో గెలుపు ఎవరిది అనే విషయంలో పెద్ద ఎత్తున బెట్టింగులు కూడా సాగుతున్నాయి. అయితే ఇక జగన్ కు ఇది రెండో ఎన్నిక, గత ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత చాలా మంది నాయకులు జగన్ ని కాదు అని పక్కన పెట్టి తెలుగుదేశంలో చేరిపోయారు. ఇప్పుడు జగన్ మరోసారి ఓటమి చెందితే ఆయన వెంట పది మంది నాయకులు కూడా ఉండరు అని అంటున్నారు కొందరు విశ్లేషకులు.

ఇక తెలుగుదేశం పార్టీ మరింత నిలదొక్కుకుంటుంది అని. కచ్చితంగా ఇక జగన్ కు ఇది ఫైనల్ పోరు అవుతుంది అని అంటున్నారు. అయితే ఇటు కేసుల విచారణ ఎలా ఉన్నా కాస్త మానసికంగా పార్టీ మాత్రం ఎవరూ ఊహించని దారుణమైన పరిస్దితికి వెళుతుంది అంటున్నారు. అందుకే జగన్ గెలుస్తాం అనే ధీమాతో పైకి కనిపిస్తున్నా ఓటమి అంచున ఉన్నామా అనే ఆవేదనలో కూడా ఉన్నారు అని అంటున్నారు, అయితే ఇప్పుడు ఏపీ చాలా క్లిష్ట పరిస్దితుల్లో ఉంది. ఇప్పుడు సీనియర్ నాయకుడు అవసరం అని మరోసారి బాబుకి అవకాశం ఇచ్చినా పెద్ద ఆశ్చర్యపోవక్కర్లేదు అనేది ప్రజల టాక్.