ఏదైనా ఒక పార్టీలో చేరే వరకూ నాయకుడి గురించి ఎలాంటి వార్తలు లీక్ అవ్వకూడదు, అది రాజకీయపార్టీల్లో ఉండే కనీస నియమం. అయితే సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ తెలుగుదేశంలో చేరుతారు అని వార్తలు వచ్చేసరికి అందరూ కూడా ఆయన ఎక్కడ నుంచి పోటీ చేస్తారు అని భావించారు అయితే ఆయన గుంటూరు నుంచి పోటీ చేస్తారు అని వార్తలు వచ్చాయి. తాజాగా ఆయన భీమిలి నుంచి పోటీ చేయనున్నారు అనేది నిన్న అంతా జరిగిన ప్రచారం.
కాని ఆయనను ఎంపీగా పంపించే యోచనలో చంద్రబాబు ఉన్నారు.. ఆయనని విశాఖ ఎంపీ అభ్యర్దిగా చంద్రబాబు ఉండాలి అని కోరుతున్నారు. బాలయ్య చిన్న అల్లుడు శ్రీభరత్ ను రాజమండ్రి ఎంపీగా, అలాగే లక్ష్మీనారాయణను విశాఖ ఎంపీగా బరిలోకి దించాలి అని చూస్తున్నారు. సో రాజకీయంగా చంద్రబాబు కొత్త నిర్ణయం తీసుకున్నారు, అయితే ఇక్కడ జేడి ఎలాంటి పరిస్దితిలో అయినా గెలుస్తారు. ఎమ్మెల్యేగా ఎంపీగా ఏ సీటుకి పోటీ చేసినా గెలుస్తారు అని అంటున్నారు. ఇప్పుడు ఆయనకు ఉన్నా చరిష్మా అలాంటిది. ఆయన మరికొద్ది గంటల్లో చంద్రబాబుని కలిసి పార్టీలో చేరుతారు అని, చేరిన వెంటనే ఆయన ఎక్కడ నుంచి పోటీ చేసేది కూడా ఆయనే ప్రకటిస్తారు అని అంటున్నారు తెలుగుదేశం నేతలు