కిమ్ ఆస్తి ఎంతో తెలిస్తే షాకవుతారు అపర కుబేరుడు

కిమ్ ఆస్తి ఎంతో తెలిస్తే షాకవుతారు అపర కుబేరుడు

0
42

ప్రపంచంలో అపరకుభేరులు అంటే వెంటనే చెప్పే పేర్లు జెఫ్ బెజోస్, ముఖేష్ అంబానీ, రతన్ టాటా.. బిల్ గేట్స్ , వారెన్ బఫెట్ , జుకర్ బర్గ్ , ఇలా చాలా మంది ఉన్నారు.. అపర కుబేరుల అధికారిక జాబితాను ప్రతీ ఏటా ఫోర్బ్స్, ఫార్చ్యూన్ వంటి ప్రముఖ మ్యాగజైన్లు విడుదల చేస్తుంటాయి. అయితే ఇప్పుడు తాజాగా కిమ్ గురించి చర్చ జరుగుతోంది, నార్త్ కొరియా అధినేత కిమ్.

కిమ్ జాంగ్ ఉన్ ఈ మధ్య బాగా వార్తల్లో ఉంటున్నారు, తాజాగా ఆయన ఆస్తుల గురించి ఓ వార్త బయటకు వచ్చింది, చిన్న దేశానికీ అధ్యక్షుడు అయినప్పటికీ అతను ఊహకు అందనంత సంపాదించారు. ఇక ఇలాంటి అధినేత ఎంత సంపాదించినా ఆ వార్తలు బయటకు రావు, తాజాగా దీని గురించి వార్తలు వస్తున్నాయి.

కిమ్కు సుమారు 5 బిలియన్ డాలర్లకు పైగా ఆస్తులు ఉన్నట్లు సమాచారం. ఇవన్నీ కూడా ఉత్తర కొరియాలోని సహజ సంపదనను అమ్మి పోగుజేశారని తెలుస్తోంది. ఇక ఆయన ఎంత విలాసవంతంగా ఉంటారో తెలిసిందే , రిచ్ లైఫ్ పాష్ గా ఉంటాడు. ఈ సొమ్మును అనేక రకాలుగా పెట్టుబడులు పెట్టారు అని అంటారు.