మంగళగిరిలో మతిపోయే సర్వే గెలిచేది ఎవరంటే

మంగళగిరిలో మతిపోయే సర్వే గెలిచేది ఎవరంటే

0
121

ఈసారి ఎగ్జిట్ పోల్స్ చూస్తుంటే అందరికి ఆశ్చర్యం కలుగుతోంది..కచ్చితంగా ఎవరికి మెజార్టీ వస్తుంది అని అన్నీ సంస్ధలు ఒకేలా చెప్పడం లేదు. కేవలం వైసీపీ అధికారం వస్తుంది అని చెబుతున్నాయి కొన్ని సంస్ధలు , మరి కొందరు మాత్రం టీడీపీ అధికారంలోకి వస్తుంది అని చెబుతున్నారు. అయితే ఈ ఎగ్జిట్ పోల్స్ స్టేట్ లో ఎవరు అధికారంలోకి వస్తారు అని చెప్పడం తెలిసిందే… కాని ఇండివిడ్యువల్ గా ఎవరు గెలుస్తారు అని చెప్పడం కష్టం.. ఈఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అనే ఆలోచనలో కొందరి పోటీపై ఆలోచన ఉంది.. మరి అందులో ముఖ్యంగా చెప్పాల్సింది నారాలోకేష్ మంత్రిగా ఎమ్మెల్సీగా ఉండి, ఆయన ఈసారి మంగళగిరి నుంచి పోటీ చేశారు … మరి అక్కడ ఆయన గెలిచే అవకాశాలు ఉన్నాయా లేదా అనేది ఈ సర్వే సంస్ధలు ఎగ్జిట్ పోల్స్ ఏం చెబుతున్నాయి అని చూస్తే,

ఆరా సంస్థ నిర్వహించిన ఎగ్జిట్ పోల్ ప్రకారం వైఎస్ ఆర్ కాంగ్రెస్ కు 135 సీట్ల వరకు రావచ్చట . ఆంధ్రప్రదేశ్లోని 175 స్థానాల్లో 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైఎస్సార్ సీపీకి స్పష్టమైన మెజారిటీ వస్తోంది. ఇక లోక్సభ విషయానికి వస్తే.. ఏపీలోని 25 లోక్సభ స్థానాల్లో వైఎస్సార్ సీపీ 22 స్థానాలను గెలుచుకుంటుందట. ఇక టీడీపీకి మూడు స్ధానాలు వస్తాయి అని తెలియచేసింది. ఇక సీఎం తనయుడు మంగళగిరి బరిలో దిగినవేళ నుంచి లోకేశ్ గెలుపుపై ధీమా తక్కువగానే ఉంది. ఈ సమయంలో ఆయన ప్రచారం పై కూడా అనేక విమర్శలు కూడా వచ్చాయి, అయితే అసలు లోకేశ్ కు అది సూటబుల్ ప్లేస్ కాదన్న వాదనలూ వున్నాయి. కానీ లోకేశ్ మొండిపట్టు వల్లే మంగళగిరిలో పోటీ చేశాడట..కాని ఇక్కడ వైసీపీ గెలుపుఖాయం అని ఈ సర్వేలో తేలిందట.దీంతో వైసీపీ శ్రేణులు జోష్ లో ఉన్నారు టీడీపీ శ్రేణులు ఫలితాల వరకూ ఆగాల్సిందే అని చెబుతున్నారు.