ప్రియాంక రెడ్డికి ఒక న్యాయం, మరియమ్మకు ఇంకో న్యాయమా?

0
123

తెలంగాణలో దళితుల చావులకు విలువ లేకుండాపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ. గతంలో చనిపోయిన ప్రియాంకరెడ్డికి ఒక న్యాయం.. మొన్న చనిపోయిన మరియమ్మకు ఒక న్యాయమా? అని మంద కృష్ణ ప్రశ్నించారు. తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక అధ్యర్యంలో దళితుల అభ్యున్నతి’ అనే అంశంపై సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జరిగిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో మంద కృష్టమాదిగ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంద కృష్ణ మాదిగ పలు అంశాలపై దళితులకు జరుగుతున్న అన్యాయాలను వివరించారు. దళిత మహిళ మరియమ్మ ఎన్‌కౌంటర్ విషయంలో ఇప్పటి వరకు పోలీసులపై లాకప్ డెత్, ఎస్సి, ఎస్టి అట్రాసిటి కేసులను ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. ప్రియాంక రెడ్డి, కల్నల్ చనిపోయినప్పుడు కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఇచ్చారు. మరి మరియమ్మ కుటుంబానికి ఇవ్వడానికి సిఎం రిలీఫ్ ఫండ్ ఖాళీ అయిందా అని ప్రశ్నించారు. ఆమె మరణానికి చేసిన సాయం ఎస్సి నిధుల నుంచి ఇవ్వడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు.

మరియమ్మ మృతి విషయంలో నిందిత పోలీసులపై అట్రాసిటీ కేసు నమోదై ఉంటే మరియమ్మ కుటుంబానికి కోటి రూపాయల విలువ చేసే భూములు వచ్చేవి కదా?.  సంతోష్ కుమార్ కుటుంబానికి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మరియమ్మ కుటుంబానికి మా ఎస్సీ కార్పొరేషన్ నుంచి ఇచ్చి నువ్వు చేసిన మేలేమిటి కేసిఆర్? అని ప్రశ్నించారు.