పలు కీలక అంశాలపై సీఎం జగన్ చర్చ….

పలు కీలక అంశాలపై సీఎం జగన్ చర్చ....

0
105

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అద్యక్షతన సమావేశమై పలుకీలక అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది… కరోనా నిభందనలు నేపధ్యంలో సామాజిక దూరాన్ని పాటించేందుకు వీలుగా సమావేశాన్ని వీడియోకాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు… ముఖ్యంగా రాష్ట్రవ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా వైరస్ నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యల గురించి సమీక్షించినట్లు తెలుస్తోంది…

ఎస్సీ ఎస్టీ మైనార్టీ చేయూత పథకంపై కూడా చర్చ జరిగినట్లు సమాచారం త్వరలో జరుగనున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల అంశం కూడా చర్చకు వచ్చింది… ఇక ఇంజనీరింగ్ కళాశాలతో పాటు మూడు నర్సింగ్ హోంలకు కేబినెట్ అమోదం తెలిపే అవకాశం ఉంది…. చిరు వ్యాపారులకు ఏ విధంగా ప్రభుత్వ సాయం అందించాలన్న అంశంపై కూడా సమాలోచన చేశారు…

ఏడాది పాలనలో అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వ చేపట్టిన సంక్షేమ పథకాల పట్ల రాష్ట్ర ప్రజలంతా సంతోషంగా ఉన్నారంటూ పలువురు మంత్రులు ముఖ్యమంత్రిదృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది…