అమర్‌నాథ్‌ వరదల్లో చిక్కుకున్న ఏపీ వాసులు..సీఎం జగన్‌ కీలక ఆదేశాలు

0
41

అమర్‌నాథ్ యాత్రలో అకస్మిక వరదలు బీభత్సం సృష్టించాయి. ఇప్పటివరకూ 16 మంది మృతి చెందినట్లు తేలగా..రాత్రి నుంచి కొనసాగిన సహాయ చర్యల్లో కొట్టుకుపోయినట్లుగా భావిస్తున్న వారి మృతదేహాలు లభించలేదని అధికారులు తెలిపింది. ప్రస్తుత అమర్‌నాథ్‌కు భక్తులను అనుమతించడం లేదు.

అయితే అమర్‌నాథ్ యాత్రకు వెళ్లిన ఏపీ వాసులు కొందరు గల్లంతయ్యారు. రాష్ట్రానికి చెందిన ఐదుగురు యాత్రికులు కాగా అందులో ఒకరు క్షేమంగా ఉన్నారు. వినోద్ అశోక్ – విజయవాడ,గునిశెట్టి సుధ – రాజమహేంద్రవరం,. మధు – తిరుపతి, ఝాన్సీలక్ష్మి – గుంటూరు వారు గల్లంతయ్యారు.  విజయనగరం వాసి నాగేంద్రకుమార్‌ క్షేమంగా ఉన్నారు.

అమర్‌నాథ్ యాత్రకు వెళ్లిన ఏపీ వారిని రక్షించేందుకు ప్రభుత్వం రంగంలోకి దిగింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో ఢిల్లీలోని ఏపీ భవన్ అధికారులు కేంద్రంతో సమన్వయం చేస్తున్నారు. అమర్‌నాథ్ యాత్రికుల కోసం ఇప్పటికే ఏపీ భవన్​లో హెల్ప్‌లైన్ ఏర్పాటు చేశారు. పూర్తి వివరాలకు హెల్ప్‌లైన్ నెంబర్​ 011-23387089ను సంప్రదించాలని అధికారులు తెలిపారు.