పీకే సర్వే గుట్టు రట్టు చేసిన టీడీపీ

పీకే సర్వే గుట్టు రట్టు చేసిన టీడీపీ

0
97

ఈసారి ఏపీలో వైసీపీ గెలుస్తుంది అని ఆ పార్టీ నేతలు ఎంతో ధీమాగా చెబుతున్నారు.. కాని వాస్తవంగా ఎగ్జిట్ పోల్ ఫలితాలు వేరుగా ఉన్నాయి అని అంటున్నారు… దీనికి కారణం కూడా చెబుతున్నారు. అన్నీపథకాలు సంక్షేమ కార్యక్రమాలు చంద్రబాబు చేసిన తర్వాత జగన్ వచ్చి చేసేది ఏమీ ఉంది అని కూడా ప్రశ్నిస్తున్నారు జనం. ఇక ఉత్తరాధి నుంచి ప్రశాంత్ కిషోర్ ని ఎన్నికల వ్యూహాకర్తగా నియమించుకున్నారు జగన్.. అయితే ఆయన సర్వేల ప్రకారం సీట్లు ఇవ్వడం అభ్యర్దులకు టిక్కెట్లు ఇవ్వడం జరిగింది..

జగన్ పాదయాత్ర ఎన్నికల ప్రచార సభలు అన్నీ ఇలాగే నిర్వహించారు.. అయితే పీకే ఎఫెక్ట్ ఈసారి వైసీపీకి ఎంత లాభిస్తుంది అని పెద్ద ఎత్తున నేతలు కూడా చర్చించుకుంటున్నారు. మొత్తానికి అన్ని ఎగ్జిట్ పోల్స్ ఎన్నికలు అయిన తర్వాత విడుదల అయ్యాయి, ఇక్కడ తెలుగుదేశం నేతలు ఒక విషయం ప్రశ్నిస్తున్నారు, ఎన్నికలకు ముందు మాత్రం ప్రశాంత్ కిషోర్ సర్వేలు వైరల్ అయ్యాయి, అంతేకాదు వైసీపీ తరపున నేతలు కూడా ఆ సర్వేలను చూసి ఆనందించారు. కాని ఇప్పుడు మాత్రం అన్ని ఎగ్జిట్ పోల్స్ వచ్చినా పీకే ఎగ్జిట్ పోల్స్ రాలేదు.

అయితే జగన్ కు సీఎం మీరే అవుతారు అని చెప్పి టీం అందరి నుంచి వీడ్కోలు తీసుకుని వెళ్లిపోయారు పీకే, తర్వాత అసలు ఎక్కడా కనిపించలేదు, ఇప్పుడు ఏపీలో ఎగ్జిట్ పోల్స్ విడుదల అయిన వేళ పీకే ఎగ్జిట్ పోల్స్ విడుదల అవుతాయి అని అనుకున్నారు.. కాని ఆయన విడుదల చేయలేదు .. అయితే నిజంగా సీఎం జగన్ అవుతారు కదా అని ఎగ్జిట్ పోల్స్ ఆయన చేయలేదా అని విమర్శలు వస్తున్నాయి.. మరి మోదీకి కూడా తన సర్వేటీం ద్వారా ఎగ్జిట్ పోల్ తీసుకున్నారు. ఇప్పుడు ఎందుకు తీసుకోలేదు పీకే ఎందుకు బ్యాక్ స్టెప్ వేశారు అని ప్రశ్నిస్తున్నారు.