జగన్ పై అవన్నీ అక్రమ కేసులే సీబీఐ రిటైర్డ్ ఎస్పీ

జగన్ పై అవన్నీ అక్రమ కేసులే సీబీఐ రిటైర్డ్ ఎస్పీ

0
48

జగన్ పై పెట్టిన కేసులు అన్నీ కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఆయనని ఇరికించి పెట్టింది అని ఇప్పటికీ జగన్, వైసీపీ నాయకులు అలాగే ప్రజలు కొందరు విశ్వసిస్తూ ఉంటారు .. అందుకే జగ్ పై పెట్టిన కేసులు ఒకొక్కటిగా వీగిపోతున్నాయి అని చెబుతుంటారు. ఇటు ఐఎఎస్ అధికారులు పై వచ్చిన అభియోగాలలో ఆ కేసులు కూడా వీగిపోతుండటంతో వారు కూడా బయటపడుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్పై నమోదైన ఆస్తులకు సంబంధించిన కేసులపై సీబీఐ రిటైర్డ్ ఎస్పీ సుభాష్ చంద్రబోస్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ పై పెట్టిన కేసుల గురించి మాట్లాడారు ఓ ఇంటర్వ్యూలో.

అసలు జగన్ పై పెట్టిన కేసులు నిరూపితం కాలేదు అని, అందుకే ఆ కేసులు వీగిపోతున్నాయి అని అన్నారు.. అసలు జగన్ సెక్రటేరియేట్ కు వెళ్లలేదు, అలాగే ఏ అధికారిని బెదిరించలేదు. ఒత్తిడి తీసుకురాలేదు, కాని జగన్ పై ఎలా విమర్శలు చేస్తున్నారు. ఆయన పై ఆరోపణలు మాత్రమే ఇవన్నీ అని ఆయన తెలియచేశారు. ఏ కేసు నిరూపితం కాకుండా జగన్ ని 16 నెలలు జైలులో పెట్టారు అని అన్నారు ఆయన. ఇప్పుడు ఆ రిటైర్డ్ ఎస్పీ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.