SERP ఉద్యోగులకు కారుణ్య నియామకాలు

Compassionate appointments serp employees jac

0
55

కరోనాతో మరణించిన సెర్ప్ ఉద్యోగుల కుటుంబాలకు కారుణ్య నియామకాలు చేపట్టాలని సెర్ప్ ఉద్యోగుల జెఎసి డిమాండ్ చేసింది. గత సంవత్సర కాలంలో కరోనా వైరస్ బారినపడి 26 మంది సెర్ప్ సిబ్బంది అకాల మరణం చెందారని జెఎసి నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో వీధిన పడుతున్న సెర్ప్ సిబ్బంది కుటుంబాలను ఆదుకోవడానికి కారుణ్య నియామకాలు చేపట్టాలని జేఏసీ నాయకులు కుంట గంగాధర్ రెడ్డి, ఏపూరి నరసయ్య సెర్ప్ అధికారులకు వినతి పత్రం సమర్పించారు..

 

కరోన 2వ దశ గ్రామాల్లో చాలా దారుణంగా విస్తరించిన ఈ ఆపద కాలంలో సెర్ప్ సిబ్బంది ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ, మహిళా సంఘాలకు రుణాల పంపిణీ, కొత్త వ్యాపారాలకు రుణాలు ఇప్పించడం, వార్షిక ఆడిట్, ఇంటింటి జ్వర సర్వే, వాక్సిన్ పై అవగాహన వంటి కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్నారని తెలిపారు. ఈ క్రమంలోనే గత వారం రోజులలో మెదక్ జిల్లాలో సీసీ గా పని చేస్తున్న యాదగిరి కరోనా తో మరణించాడనీ,  వికారాబాద్ జిల్లాలో మరో సిసి కృష్ణ కరొనాతో అకాల మరణం చెందారన్నారు.

 

ఇలా గత సంవత్సర కాలంలో 26 మంది SERP ఉద్యోగులు అకాల మరణం చెందడం తో అన్నపెట్టే వ్యక్తిని కోల్పోయి ఆ కుటుంబాలు వీధిన పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది వరకు పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వం మరియు ఉన్నత అధికారులు ఇచ్చిన హామీ మేరకు వెంటనే SERP లో కారుణ్య నియామకాలు అమలు చేయాలని ఈ సందర్భంగా లేఖలో విజ్ఞప్తి చేశారు.

 

మరోపక్క ఆస్పత్రుల్లో కరోనా వైద్యం పేరుతో పరిమితికి మించి ఖర్చు అవుతోందని కరోణ వైద్యానికి ఇప్పుడున్న హెల్త్ కార్డులపై మొత్తం కుటుంబానికి రూ. నాలుగు లక్షల రూ. మాత్రమే కవరేజ్ ఉందని అన్నారు. అయినా ఇన్సూరెన్స్ కంపెనీ క్లెయిమ్ సరిగా అమలు చేయడం లేదన్నారు.

 

4లక్షలు కాకుండా ఎంత ఖర్చు అయితే అంత సీలింగ్ లేకుండా కుటుంబం మొత్తం ఇన్సూరెన్స్ కార్డ్స్ క్రిందనే కవరేజ్ చేయాలని వినతి పత్రంలో కోరారు. కరోనా సోకి ఆస్పత్రిలో ట్రీట్మెంట్ పొందుతున్న వారికి మరియు హోం ఐసోలేషన్ లో ఉన్నవారికి ప్రత్యేకంగా మెడికల్ లీవ్ వర్తింపజేయాలని ప్రస్తుతం అలా చేయకుండా వేతనాలు కట్ చేసే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు..

 

కరోణ ఆపద కాలంలో SERP సిబ్బంది వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ, మహిళా సంఘాలకు రుణాల పంపిణీ వంటి కార్యక్రమాల్లో ప్రాణాలను లెక్కచేయకుండా విధుల నిర్వహణ చేస్తున్నందున క కరోణ వారియర్స్ గా గుర్తించి మరణించిన వారి కుటుంబాలకు 25 లక్షల రూపాయలు  నష్టపరిహారం చెల్లించాలని వినతి పత్రం లో కోరారు.

 

పేదరిక నిర్మూలన కోసం, రైతుల సంక్షేమం కోసం, మహిళా సాధికారత కోసం ప్రాణాలు పణంగా పెట్టి అమరులైన SERP ఉద్యోగుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొని ఆదుకోవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.