వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇది కంచుకోటగా మారబోతోంది అంటున్నారు నాయకులు..ఈసారి ఎలాగైనా ఎంపీ సెగ్మెంట్ వైసీపీ గెలవడం పక్కా అంటున్నారు నాయకులు.. ముఖ్యంగా ఐదు సంత్సరాలుగా ఇక్కడ వైసీపీ కేడర్ బలంగా ఉంది …అందుకే అభ్యర్దులని ఫైనల్ గా లాస్ట్ లో అనౌన్స్ చేసినా మధ్యలో కొందరిని మార్చినా కేడర్ ఉంది అనే భరోసా కనిపిస్తోంది పార్టీలో…ముఖ్యంగా ఆ సెగ్మెంట్లో వైసీపీ గెలుపు నల్లేరుపై నడక అంటున్నారు అదే నరసాపురం ..అయితే ఈసారి ఇక్కడ నుంచి జనసేన తరపున నాగబాబు పోటీచేస్తున్నారు.. వైసీపీ తరపున రఘురామకృష్ణం రాజు పోటీ చేస్తున్నారు …బీజేపీ తరపున మాణిక్యాలరావు పోటీ చేస్తున్నారు.. కాంగ్రెస్ తరపున బాపిరాజు పోటీ చేస్తున్నారు.. తెలుగుదేశం పార్టీ తరపున ఉండి ఎమ్మెల్యే శివ ఇక్కడ ఎంపీగా పోటీ చేస్తున్నారు.
అయితే వీరిలో ముఖ్యంగా వైసీపీకి ఇక్కడ ప్రజా ఆకర్షన ఉంది… ముఖ్యంగా రఘురాజు ఇక్కడ అందరికి సుపరిచితులు.. అలాగే ఎమ్మెల్యే అభ్యర్దులు అందరితో ఆయనకు మంచి సత్సంబంధాలు ఉన్నాయి అనేది అందరూ చెప్పేది.. అయితే ఇటీవల సోషల్ మీడియాలో నెగిటీవ్ క్యాంపెయినింగ్ చేస్తున్నా దానిని పట్టించుకోవలసిన అవసరం లేదు అంటున్నారు వైసీపీ నేతలు … ముందుగానే సర్వే చేయించిన దానిలో కూడా రఘురాజుకి పాజిటీవ్ పవనాలు వచ్చాయి అంటున్నారు.. అలాగే ఐదు సంవత్సరాలలో బీజేపీ తెలుగుదేశం ఇక్కడ చేసింది ఏమీ లేదు అంటున్నారు నేతలు.