టీడీపీకి ఎన్నిసీట్లు వ‌స్తాయో ప‌క్కా స‌మాచారం

టీడీపీకి ఎన్నిసీట్లు వ‌స్తాయో ప‌క్కా స‌మాచారం

0
102

మ‌రోసారి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వ‌స్తుంద‌ని తాజా మాజీ స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద్ రావు అన్నారు. ఈ ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు నాయుడు నేతృత్వంలో 175 అసెంబ్లీ స్థానాల‌కుగాను 130 అసెంబ్లీ సీట్లు టీడీపీ కైవసం చేసుకుంటుంద‌ని అన్నారు. ఇందుకు సంబంధించిన ప‌క్కాస‌మాచారం త‌న ద‌గ్గ‌ర ఉంద‌ని అన్నారు. రాష్ట్రంలో ప్ర‌జ‌లు సంతోషంగా ఉండాలంటే చంద్ర‌బాబు నాయుడు మ‌రోసారి ముఖ్య‌మంత్రి కావాల‌ని అన్నారు.

తాజాగా పార్టీ కార్యాల‌యంలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ త‌న‌పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు ప‌క్కా ప్లాన్ తో దాడికి ప్ర‌య‌త్నించార‌ని అన్నారు. గ‌త ఐదు సంవ‌త్స‌రాల‌నుంచి న‌ర‌స‌రావు పేట‌లో శాంతి భ‌ద్ర‌త‌ల‌ను కాపాడున్నాన‌ని అన్నారు. ఓ ప‌థ‌కం ప్ర‌కారం వైసీపీ నాయ‌కులు త‌న‌పై దాడికి దిగార‌ని కోడెల మండిప‌డ్డారు. అయితే ఘ‌ర్ష‌ణ వ‌ద్ద‌ని త‌న కార్య‌క‌ర్త‌లకు చెప్ప‌డంతో త‌మ నేత‌లు త‌న మాట‌కు క‌ట్టుబ‌డి ఉన్నార‌ని అన్నారు.

ఈ విష‌యాలు ప్ర‌జ‌లంద‌రికీ తెలుస‌ని అన్నారు, త‌నపై దాడికి పాల్ప‌డిన వైసీపీ నాయ‌కులు ప‌శ్చాత్తాపం ప‌డాల్సింది పోయి వారు త‌మ‌పైనే ఫిర్యాదు చేయ‌డం విడ్డురంగా ఉంద‌ని అన్నారు. వైసీపీ అధికారంలోకి వ‌స్తే విచ్చ‌ల‌విడిగా రౌడీలు చ‌ల‌రేగుతార‌ని గ్ర‌హించి ప్ర‌జ‌లు జ‌గ‌న్ కు ఓటు ద్వారా బుద్ది చెప్పార‌ని కోడెల అన్నారు. కాగా పార్టీ అధికారంలోకి వచ్చిన‌ప్ప‌టినుంచి అమ‌రావ‌తి స‌చివ‌లాయంలోని పార్టీ కార్యాలయంలోకి కోడెల వెళ్ల‌డం ఇదే మొద‌టి సారి.