చంద్రబాబు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు

చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు .

0
43

టీడీపీ ఏమ్మెల్యే వల్లభనేని వంశీ కుటుంబసభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు.ఆ తరువాత అయన మీడియా తో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ గెలుపు ఖాయమని, చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారని చెప్పుకొచ్చారు.

వైసీపీ ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలో సాంకేతికను ఉపయోగించుకుని ప్రతి నియోజకవర్గంలో ఐదు నుంచి 10వేల టీడీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగించేందుకు వైసీపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఓటనేది ప్రాథమిక హక్కని వైసీపీ కుట్రను ప్రజలు తిప్పికొడతారని అన్నారు.వైసీపీ ఎన్ని కుట్రలు చేసిన టీడీపీ మళ్ళీ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన చెప్పుకొచ్చారు.