వైసీపీ నుంచి బయటకు వచ్చి ఏ రాజకీయ పార్టీలో చేరకుండా ఉన్నారు వంగవీటి రాధా, ముఖ్యంగా విజయవాడ సెంట్రల్ సీటు ఆశించిన ఆయన ,వైసీపీలో ఆసీటు రాదు అనేసరికి పార్టీ నుంచి బయటకు వచ్చారు. తనకు తగిన గుర్తింపు లేదు అని జగన్ తనని చాలా తక్కువగా చూశారు అని విమర్శలు చేశారు. అయితే ఆయన ప్రెస్ మీట్లలో తెలుగుదేశంలో చేరుతారా అంటే ఎటువంటి సమాధానం చెప్పలేదు. తర్వాత ఆయనతో వరుసగా తెలుగుదేశం నేతలు భేటీ అవ్వడంతో ఆయన తెలుగుదేశంలో చేరుతారు అని అందరూ అనుకున్నారు. తన తండ్రి కోరిక నెరవేరాలి అని చంద్రాబుకు తెలియచేశారు. పేదలకు పక్కా దస్తావేజీలు పట్టాలు ఇప్పించాలి అని తెలియచేశారు. ఇక ఇప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీలో చేరే యోచనలో ఉన్నారు అని బెజవాడ వేదికగా వార్తలు వినిపిస్తున్నాయి.
తెలుగుదేశం పార్టీ తరపు నుంచి లోక్ సభ అభ్యర్థిగా వంగవీటి రాధా మచిలీపట్నం నుంచి పోటీ చేయనున్నారని సమాచారం. ఇప్పుడు ఇదే వార్త తెలుగుదేశం నేతలు కూడా చెబుతున్నారు. కృష్ణాలో ఎక్కడ నుంచి ఆయన పోటీ చేసినా తెలుగుదేశం పార్టీ తరపున విజయం తథ్యం అంటున్నారు జిల్లా తెలుగుదేశం నేతలు, మరి బాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.