వైసీపీలోకి వంశీ సన్నిహితులు విజయవాడలో కొత్త టాక్

వైసీపీలోకి వంశీ సన్నిహితులు విజయవాడలో కొత్త టాక్

0
115

టీడీపీలో వంశీ రేపిన చిచ్చు ఇంకా ఆరేలా లేదు, అయితే వంశీ దారిలో మరికొందరు టీడీపీకి గుడ్ బై చెబుతారు అని వార్తలు వినిపిస్తున్నాయి, అయితే వంశీ తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చే సమయంలో, కొందరితో చర్చించి ఆ తర్వాత పార్టీకి గుడ్ బై చెప్పారు. దీంతో తెలుగుదేశంలో అసంత్రుప్తులు ఎవరు అనేది వంశీకి తెలుసు..

అయితే వైసీపీ ఆరకంగా రాజకీయం ఏమైనా చేస్తుందా అంటే వైసీపీ ఆలోచన ఆ సరికి లేదు అని చెబుతున్నారు పార్టీ నేతలు, ముఖ్యంగా వంశీతో కొత్తగా రాజకీయ పావులు కదపాలి అని జగన్ భావించడం లేదు.

ఎందుకు అంటే జిల్లా నేతలు మంత్రులు పేర్ని నాని కొడాలి నాని ఇద్దరూ ఉన్నారు వైసీపీలో, వారికి కాకుండా వంశీకి ఇలాంటి నేతలను పార్టీలో చేర్చుకునే బాధ్యత ఇస్తారు అని లేదు, అయితే కొందరు విజయవాడ వేదికగా ప్రముఖ లీడర్లు వైసీపీలోకి వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నారట. వారు కూడా వంశీకి బాగా సన్నిహితులు అని తెలుస్తోంది.. నామినేటెడ్ పదవులు కూడా టీడీపీలో వారికి రాలేదు అనే అసంత్రుప్తి వారిలో ఉంది. అయితే వారు నేరుగా వైసీపీలోకి వస్తారా వంశీతో చర్చించి వస్తారా అనేది జిల్లాలో చర్చ జరుగుతున్న అంశం.