జేడీకి నో ఎంట్రీ చెప్పిన విజయసాయిరెడ్డి

జేడీకి నో ఎంట్రీ చెప్పిన విజయసాయిరెడ్డి

0
26

డాక్టర్ అవుదాము అని యాక్టర్ అయిన సంఘటనలు చాలా ఉంటాయి.. అలాగే ఒకపార్టీలో చేరుదాము అనుకుని చివరకు వేరే పార్టీలో చేరిన ఘటన ఈ ఎన్నికల్లో ఉంది అంటే. అది మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ అని చెప్పాలి. ముందు తెలుగుదేశం పార్టీలో చేరాలి అని అనుకున్నారు. తర్వాత వైసీపీ నుంచి వేరేవిధమైన విమర్శలు వస్తాయి అని భావించి నేరుగా జనసేనలో చేరారు ఆయన.. అయితే ఇది వైసీపీ చేసే విమర్శ. ఇక బాబు మోచేతినీళ్లు తాగే సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు వైసీపీలో స్ధానం లేదు అని అన్నారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.

48 గంటలుగా వీరి ఇద్దరి మధ్య ట్విట్టర్ వార్ జరుగుతోంది. పోటీ చేసింది తక్కువ స్ధానాలు , కాని 80 స్ధానాలు ఎలా వస్తాయి అని జేడీ చెబుతున్నారు అని విజయిసారెడ్డి కౌంటర్ వేయడం. మీరు లెక్కలు సరిగ్గా వేయండి అని కౌంటర్ వేయడం జరిగింది. ఇక తాజాగా మరోసారి కౌంటర్ ఇచ్చారు జేడిఎల్ కి విజయసాయిరెడ్డి.

చంద్రబాబు మోచేతి నీళ్లు తాగే జేడీ గారికి మా పార్టీలో ఎన్నటికీ స్థానం లేదు. ఉండదు కూడా. బహుశా ఆయనే చేరాలనుకున్నారేమో. కోవర్టు ఆపరేషన్ల కోసం వచ్చే ఆలోచన చేశారని ఇప్పడు అనిపిస్తుంది. సీబీఐ లాంటి సంస్థను బాబుకు పాదాక్రాంతం చేసిన వ్యక్తి దేశాన్ని మార్చే కలలు కంటున్నాననడం పెద్ద జోక్.అని ట్వీట్ చేశారు. అయితే ఫలితాల వరకూ ఇలాంటి విమర్శలు కామన్ అంటున్నారు నేతలు.