వైసీపీ సర్కార్ పై హాట్ కామెంట్స్ చేసిన టీడీపీ ఫైర్ బ్రాండ్..

వైసీపీ సర్కార్ పై హాట్ కామెంట్స్ చేసిన టీడీపీ ఫైర్ బ్రాండ్..

0
98

తెలుగుదేశం కార్యకర్తలు తమకు వచ్చిన పోస్టును ఫార్వర్డ్ చేసినందుకు వారు కుట్ర చేశారని పేర్కొంటూ వైసీపీ సర్కార్ కేసులు నమోదు చేస్తోందని ఆరోపించారు మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు… తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ…ప్రభుత్వం పిరికి తనంగా ఉందని ఎద్దేవా చేశారు…

గతంలో ఐదేళ్లు వైసీపీ నాయకులు నోటికి వచ్చినట్లు తిట్టారని ఇవాళ పరిపాలన చేయాలని ప్రజలు అధికారం ఇస్తే పరిపాలన చేయడం చేతకాక దాడులకు పాల్పడుతోందని ఆరోపించారు… టీడీపీ నేత పట్టాభిరాం ఇంటి ముందు పోలీసులు నిఘా పెట్టారని ఉమా ఆరోపించారు…

ఇలాంటి అక్రమాలు ఇక ముందు జరగకుండా చూడాలని పోలీస్ కమీషనర్ ను తాము కలుస్తామని చెప్పారు… ఇటీవలే జిల్లా కలెక్టర్ ను కలిసి ఏడాది కాలంలో రాష్ట్రంలో జరిగి అక్రమాలు దోపిడీ ఇసుక మైన్స్ ఇళ్ల స్థలాల పేరుతో భూములు తీసుకోవడం తదితర వాటిపై వివరించామని అన్నారు..