వికారాబాద్ జిల్లా రైతులతో వైఎస్ షర్మిల

YS sharmila meets vikarabad distric farmers

0
139

వైఎస్ షర్మిల తెలంగాణ లో  కొత్త పార్టీకి ముహుర్తాన్ని ఫీక్స్ చేయడం , తాజాగా లోటస్ పాండ్ లో తెలంగాణాల అన్ని జిల్లాల ముఖ్య నాయకులతో పార్టీ సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేయడం అన్ని పనులు కొత్త పార్టీ నిర్మణానికి  చక చక జరిగిపోతున్నాయి. కొత్త పార్టీ ఆశాయలను , ఆలోచనలు ప్రజల వద్దకు తీసుకువేళ్లే ప్రయత్నంలో బాగంగా శుక్రవారం నాడు వికారాబాద్ లో పర్యటించింది వైఎస్ షర్మిల .

వికారాబాద్ జిల్లా దోమ మండలం పాలెపల్లిలోని వరి కొనుగోలు కేంద్రం వద్ద ఉన్న వరి ధాన్యాన్ని వైఎస్ షర్మిల పరిశీలించారు. రైతులతో పాటు నేలపై కూర్చొని రైతుల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు.వరి కొనుగోలు కేంద్రం వద్ద వారు పడుతున్న సమస్యలను షర్మిలకు వివరించారు  రైతులు.తేమ శాతం,తాళు అంటూ మూడు నుంచి ఐదు కిలోల వరకు తరుగు తీస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.