వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎగ్జిట్ పోల్స్ గురించి పెద్ద ఎత్తున చర్చిస్తున్నారు.. పార్టీ నేతలు సీనియర్లతో మంతనాలు జరిపారు ..అయితే సీనియర్లు కూడా ఈ సర్వేలు నమ్మలేం అని ఇప్పటికే తెలియచేశారు. అలాగే జగన్ కూడా గత ఎన్నికల్లో ఇలా ఎగ్జిట్ పోల్స్ నమ్మి మోసపోయాం, ఇప్పుడు నమ్మినా ఇలాంటి పరిస్దితి ఉంటుంది అని చెప్పి నేతలతో చర్చించారట. అయితే జగన్ పీకే సర్వేలు వైసీపీ నేతల సర్వేలు చేయించారు .. వాటిని పరిశీలిస్తే ఈ ఎగ్జిట్ పోల్స్ కు సరిసమానంగా వాస్తవానికి దగ్గరగా కూడా లేవు. అందుకే జగన్ కూడా ఆలోచిస్తున్నారట.
ఇక సార్వత్రిక ఎన్నికల ఫలితాల సరళిని గుంటూరు జిల్లా తాడేపల్లిలోని తన నివాసం నుంచే వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సమీక్షించనున్నారు.అయితే నేడే ఆయన ఇక్కడ పార్టీ అభ్యర్థులతో భేటీ అవుతారని.. కౌంటింగ్ సందర్భంగా తీసుకోవలసిన జాగ్రత్తలను సూచిస్తారని వైసీపీ వర్గాలు తొలుత వెల్లడించాయి.తాజాగా జగన్ తన షెడ్యూల్ మార్చుకున్నారు అభ్యర్థులతో భేటీని రద్దుచేసుకున్నారని తాజాగా పేర్కొన్నాయి. బుధవారం సాయంత్రం ఆయన తాడేపల్లి నివాసానికి చేరుకుని.. అతి ముఖ్య నేతలతో సమావేశమవుతారు. తాజా రాజకీయ పరిస్థితులు, జాతీయ మీడియా వెల్లడించిన ఎగ్జిట్పోల్స్, స్థానికంగా వచ్చిన ఎగ్జిట్పోల్ ఫలితాలపై విశ్లేషిస్తారు. మొత్తానికి జగన్ నేతలకు ఎలాంటి దిశానిర్దేశం చేస్తారు అనేదానిపై పెద్ద చర్చ అయితే జరుగుతోంది. జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అని నేతలు చర్చించుకుంటున్నారు.