జగన్ మరో సంచలన నిర్ణయం

జగన్ మరో సంచలన నిర్ణయం

0
42

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈసారి కచ్చితంగా సీఎం అవ్వనున్నారు అని అనేక సర్వేలు చెబుతున్నాయి. ఇక వైసీపీ నేతలు అలాగే ప్రజలు కూడా ఇది వాస్తవం పక్కాగా సీఎం జగన్ అవుతారు అని కూడా చెబుతున్నారు. ఇక జగన్ ఓ సంచలన నిర్ణయం తీసుకోనున్నారట, ఇంతకీ ఏమి సంచలన నిర్ణయం అని అనుకుంటున్నారా, జగన్ సీఎం అయితే ఎవరు మంత్రులు అవుతారు అనేది కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి. ఓజాబితా కూడా వైరల్ అయింది.

ఈసారి కేబినెట్ కూర్పులో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు జగన్ అని తెలుస్తోంది.. ముఖ్యమంత్రిగా జగన్తోపాటు మొత్తం 26 మందితో ఏపీ మంత్రివర్గం ఏర్పాటు కానుందని పార్టీ ముఖ్య నేతలు చెబుతున్నారు. పార్టీలోని అన్ని వర్గాల వారికి సమ ప్రాధాన్యత ఇస్తూ మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయాలి అని జగన్ చూస్తున్నారు.. ఇక 25 పార్లమెంట్ స్ధానాలు ఉన్నాయి ఏపీలో, ఒక్కో పార్లమెంట్ స్ధానంలో ఒక్కో మంత్రికి అవకాశం ఇవ్వనున్నారు ఇక జిల్లాల ఏర్పాటు కూడా ఇలానే చేస్తాను అని పాదయాత్రలో చెప్పారు జగన్, ఇప్పుడు మంత్రి వర్గ కూర్పు కూడా దీనికి అనుగుణంగా చేయనున్నారు అని తెలుస్తోంది.