వైసీపీకి జగన్ బాబాయ్ షాక్

వైసీపీకి జగన్ బాబాయ్ షాక్

0
148

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున ఒంగోలు ఎంపీ టికెట్ ఆశించిన జగన్ బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి జగన్ కు పార్టీకి దూరంగా ఉన్నారా ,అవును ఆయనకు టికెట్ ఇవ్వకపోవడంతో ఆయన పార్టీకి జగన్ కి దూరంగా ఉన్నారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం లేదు.నిన్న జగన్ టంగుటూరు సభకు హాజరుకాలేదు, మాగుంటశ్రీనివాసరెడ్డిని పార్టీలోకి తీసుకోవడం, తనపై గతంలో ఓడిపోయిన వారికి టికెట్ ఇచ్చి తన సీటుకి ఎసరుపెట్టడం పై ఆయన మదనపడుతున్నారు. కుటుంబ సభ్యులతో కూడా ఆయన టచ్ లో లేరు అని తెలుస్తోంది. టికెట్ల విషయంలో జగన్ తీసుకున్న నిర్ణయంతో ఆయన షాక్ అయ్యారు.

జిల్లాలో బాలినేని తనని ఇరికించారు అని తనకు సీటు రాకుండా అడ్డుకున్నారు అని ఆయన మదన పడుతున్నారు. ఈ సమయంలో పార్టీలో కొంందరు అసంతృప్తులు తమకు టికెట్ రాలేదు అని ,మాకు సాయం చేయాలి అని ఆయన్ని కోరితే ,నాకే టికెట్ రాలేదు నేనేం చేయను అని ఆయన మదనపడ్డారట ..ఇక ఒంగోలులో ఆయన ప్రచారం చేయడం లేదు. ఇక పార్టీ నేతలకు కూడా ఆయన అందుబాటులో లేరు. ఎన్నికల సమయంలో వైవీ ఎలాంటి డెసిషన్ తీసుకుంటారా అనే చర్చ అయితే నడుస్తోంది.