జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వడం ఎల్లో మీడియా జీర్ణించుకోలేకపోతోంది. అయితే జగన్ పై ఎంత కక్ష ఉందో ఆ వార్తల్లో కనిపిస్తోంది. ఏపీలో దారుణమైన పాలన జరుగుతోందట, మరి ఎల్లో మీడియాకి జగన్ ఇచ్చిన షాకులు ఆర్ధికంగా కొట్టిన దెబ్బ అంత గట్టిగా తగిలింది అంటున్నారు వైసీపీ నేతలు, నాడు వైయస్ పై కూడా ఇంత దారుణమైన వార్తలు రాయని ఆ ఎల్లో మీడియా జగన్ ని టార్గెట్ చేసింది.
ముఖ్యంగా చంద్రబాబు కు బాకాలు పలికినా పర్వాలేదు కాని, ఒకరిని హైలెట్ చేయడానికి జగన్ ని డీ గ్రేడ్ చేయడం వైసీపీ నాయకులు జగన్ ఫ్యాన్స్ తట్టుకోలేకపోతున్నారు.. ఇప్పటికే అసత్య వార్తలు రాస్తే ఆ మీడియాల పని పడతాం అని చెప్పింది ప్రభుత్వం.. అయినా ఇంకా అసత్య వార్తల జోష్ పెంచింది ఆ పత్రిక.. దీంతో వైసీపీ నేతలు ఆ పత్రికపై కేసులు వేసేందుకు సిద్దం అవుతున్నారు.
జగన్ ఎమ్మెల్యేలకి మంత్రులకి వార్నింగ్ ఇచ్చారని, అలాగే ఎమ్మెల్యే రోజాకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారని, తెలంగాణ ఆర్టీసీ విషయంలో జోక్యం వద్దని అన్నారట. ఇలా పలువురిని టార్గెట్ చేస్తోంది. అలాగే ఇద్దరు మంత్రులకు మధ్య విభేదాలు ఉన్నాయి అని నెల్లూరు జిల్లా గురించి మరో వార్త ఇలా అసత్య వార్తలు రచన చేస్తోంది. దీంతో వైసీపీ నేతలు రంగంలోకి దిగారు లీగల్ గా ఈ గలీజ్ మీడియాపై కేసులు వేయాలి అని చూస్తున్నారు, మొత్తానికి ఎల్లో మీడియాని ఏపీలో బ్యాన్ చేయాలనే నినాదం కూడా ఇటీవల సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వినిపిస్తోంది.