ఇంటర్ నెట్ ఉపయోగిస్తే ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి, అలాగే చెడుకి వాడితే చెడు దారులు ఉన్నాయి, అయితే కొందరు చెడు దారులు ఎంచుకుంటున్నారు, చివరకు పోలీసులకి చిక్కుతున్నారు, చెడు వ్యసనాలకు లోనవుతున్నారు కొందరు, దీంతో ఇంటర్ నెట్ సాయంతో డబ్బుల కోసం విలాసాల కోసం తప్పుడు మార్గాలు వెతుకుతున్నారు.
డేటింగ్ పేరుతో దోపిడీ..ఆన్‌లైన్‌లో అమ్మాయిలతో చాటింగ్‌లు, డేటింగ్‌లు చేసేందుకు ఆన్‌లైన్ పోర్టల్‌ను ఓపెన్ చేశాడో ప్రబుద్ధుడు. ముందుగా డేటింగ్ పేరుతో ఎవరైనా ఇంట్రస్ట్ చూపిస్తే, ఆన్ లైన్ లో వారికి అమ్మాయిలా ఫోటోలు పంపిస్తాడు, అవి చూసి వారు ఎంత అడిగితే అంత నగదు డిపాజిట్ చేస్తారు.
ఇక తర్వాత ఆ ఫోన్ స్విఛ్చాప్ చేస్తాడు, అయితే ఓ వ్యక్తి కి ఇలా అమ్మాయిలతో చాటింగ్ అంటూ వల వేశాడు. ఇలా నగదు డిపాజిట్ అయ్యాక అతని ఫోన్ స్విఛ్చాప్ అయింది, దీంతో ఆన్ లైన్ లో ఆ వ్యక్తి కంప్లైంట్ ఇచ్చాడు, పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.