Flash: గుడ్ న్యూస్..ఇకపై ఇంటివద్దకే ఆధార్‌ సేవలు

0
106

ఆధార్‌కార్డు ప్రతి ఒక్కరికి ఎంత అవసరమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎందుకంటే ప్రభుత్వంకు చెందిన ఏ సంక్షేమ పథకానికైనా పొందాలంటే ఆధార్ ఉండడం తప్పనిసరని అందరికి తెలుసు. అందుకే ఆధార్‌కార్డు సేవలపై ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాలల్లో చేరనున్న ఐదేండ్ల లోపు పిల్లల ఆధార్‌ వివరాలను వారి ఇండ్ల వద్దనే పోస్టల్‌శాఖ ఉచితంగా నమోదు చేస్తుందని అధికారులు వెల్లడించారు.

పిల్లల పుట్టిన తేదీ ధ్రువపత్రం, ఫొటో, బయోమెట్రిక్‌ తదితర వివరాలను తల్లిదండ్రులు తమ ఇంటి వద్దకు వచ్చిన పోస్టుమ్యాన్‌కు అందజేస్తే చాలని అధికారులు తెలిపారు. తెలంగాణలో 1,552 మంది డాక్‌సేవక్‌లు, పోస్ట్‌మ్యాన్‌లు ఆధార్‌ నమోదు సేవల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో ఆధార్ సేవల కోసం ఎక్కడికి వెళ్లకుండా ఇంటి వద్దనే సేవలు అందిస్తున్నదందుకు ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.