India vs England | రాజ్‌కోట్ వేదికగా ఇంగ్లాండ్ జట్టుతో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌లో టీమ్ ఇండియా బ్యాటర్లు అదరగొట్టారు. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 326/5 పరుగులు చేసింది. 33 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న భారత్‌ను కెప్టెన్ రోహిత్ శర్మ, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా సెంచరీలతో ఆదుకున్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఇంగ్లాండ్ పేసర్ మార్క్ వుడ్ దెబ్బకు యశస్వి జైస్వాల్ (10), శుభ్‌మన్ గిల్ (0), రజత్ పాటిదార్ (5) వరుసగా పెలివియన్ బాట పట్టారు. దీంతో టీమిండియా కష్టాల్లో పడింది.
India vs England | అయితే రోహిత్ శర్మ, జడేజాతో కలిసి జట్టును ముందుకు నడిపించారు. ఈ క్రమంలోనే ధాటిగా ఆడుతూ సెంచరీ(131; 196 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్సర్లు), నమోదు చేశాడు. అనంతరం జడ్డూ కూడా సెంచరీ చేసి స్కోర్ బోర్డును పరిగెత్తించారు. ఇద్దరు కలిసి 204 పరుగులు భాగస్వామ్యం నెలకొల్పారు. జడేజా(110 నాటౌట్; 212 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్ల)తో నాటౌట్‌గా ఉన్నాడు. రోహిత్ ఔటైన తర్వాత అరంగేట్ర ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ క్రీజులోకి వచ్చాడు. తొలి టెస్టు ఆడుతున్నా భయం లేకుండా ఇంగ్లీష్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 48 బంతుల్లోనే అర్థసెంచరీ కొట్టేశాడు. అయితే జడేజాతో సమన్వయ లోపం కారణంగా రనౌట్ అయ్యాడు. ఇంగ్లండ్ బౌలర్లలో వుడ్ మూడు వికెట్లు, టామ్ హార్డ్లీఓ వికెట్ పడగొట్టారు.