INDvsAUS: టీమిండియా ఘన విజయం

-

INDvsAUS |ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన వన్డే మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. స్వల్ప లక్ష్య చేధనలో కేఎల్ రాహుల్, జడేజా రాణించి జట్టుకు విజయాన్ని అందించారు. 189 పరుగుల స్వల్ప విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియాకు ఏమాత్రం కలిసి రాలేదు. 5 పరుగుల వద్ద తొలి వికెట్, 16 పరుగులు కోహ్లీ(4) పెవిలియన్ చేరడంతో అభిమానులు టెన్షన్ పడ్డారు. సూర్యకుమార్ యాదవ్ (0) డకౌట్ కావడం, శుభమన్ గిల్ (20) సైతం పెవిలియన్ చేరడంతో ఇక భారత్ పనైపోయిందని భావించిన తరుణంలో రాహుల్‌కు జడేజా తోడయ్యాడు. మెల్లగా రాణించి జట్టును విజయం వైపుగా నడిపారు. మొత్తంగా రాహుల్ 91 బంతుల్లో 7 ఫోర్లు సిక్సర్‌తో 75 పరుగులు చేశాడు. జడేజా 69 బంతుల్లో 5 ఫోర్లతో 45 పరుగులు చేశాడు. భారత బౌలర్లలో షమీ, సిరాజ్ రెండేసి వికెట్లు తీసుకోగా, జడేజా రెండు వికెట్లు పడగొట్టాడు(INDvsAUS).

- Advertisement -
Read Also: బండి సంజయ్ తెలివి లేని దద్దమ్మ.. మంత్రి కేటీఆర్ సీరియస్

Follow us on: Google News

Read more RELATED
Recommended to you

Latest news

Must read

IPL 2024 schedule | క్రికెట్ అభిమానులకు శుభవార్త.. ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది..

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2024 షెడ్యూల్‌ (IPL...

Pawan Kalyan | పవన్ కల్యాణ్‌ చేతికి రెండు ఉంగరాలు.. ఆ రహస్యం ఏంటో తెలుసా..?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల తన కుడి చేతికి రెండు...