రంజీ ట్రోఫీ- 2022 విజేతగా మధ్యప్రదేశ్

0
108

దేశవాళీ క్రికెట్​ టోర్నమెంట్​ రంజీ ట్రోఫీ ఫైనల్​లో మధ్యప్రదేశ్​ సత్తా చాటింది. దీనితో ట్రోఫీని అందుకోవాలనే సుదీర్ఘ నిరీక్షణకు తెరదించింది. 2022 సీజన్​ విజేతగా నిలిచి.. తొలిసారి రంజీ ఛాంపియన్​గా అవతరించింది. ముంబయితో జరిగిన ఫైనల్‌ పోరులో ఆద్యంతం అధిపత్యం చెలాయిస్తూ విజేతగా నిలిచింది. ఐదురోజుల పాటు సాగిన ఈ తుదిపోరులో 6వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది.

తొలి ఇన్నింగ్స్​లో ముంబయి 374 పరుగులు చేయగా.. మధ్యప్రదేశ్​ 536 రన్స్​ చేసింది. అనంతరం రెండో ఇన్నింగ్స్​లో.. 113/2 ఓవర్​నైట్​ స్కోరుతో ఐదో రోజు ఆటను ప్రారంభించిన ముంబయి 269 పరుగులకు ఆలౌట్​ అయింది.

అనంతరం 108 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన మధ్యప్రదేశ్‌ మంచి ప్రదర్శన చేసింది. హిమాన్షు మాంత్రి(37), తొలి ఇన్నింగ్స్‌ సెంచరీ హీరోలు శుభమ్‌ శర్మ(30), రజత్‌ పాటిదర్​(30*) జట్టును విజయతీరాలకు చేర్చారు.