అంతర్జాతీయ క్రికెట్‌కు ఇప్పటికే వీడ్కోలు పలికిన తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు(Ambati Rayudu).. తాజాగా ఐపీఎల్‌కు కూడా రిటైర్మెంట్ ప్రకటించాడు. చెన్నై సూపర్ కింగ్స్-గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య జరిగే ఐపీఎల్-2023 ఫైనల్ తన చివరి మ్యాచ్ అని అధికారికంగా ప్రకటించాడు. అయితే ఇంత సడెన్‌గా ఐపీఎల్‌కు గుడ్ బై చెప్పడంపై ఓ ఆసక్తికర కారణం ఉంది. ఇటీవల కాలంలో రాయుడు ఏపీ సీఎం జగన్(Jagan)ను పొగుడుతూ ట్వీట్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. బహిరంగసభల్లో జగన్ చేస్తున్న ప్రసంగాలను ప్రశంసిస్తున్నాడు. అంతేకాకుండా తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎంను కలిశారు. దీంతో ఆయన వైసీపీ(YCP)లో చేరబోతున్నారనే వార్తలు వచ్చాయి. గుంటూరుకు చెందిన రాయుడు(Ambati Rayudu) వైసీపీలో చేరి ఎమ్మెల్యేగా లేదా ఎంపీగా పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఐపీఎల్ సమయానికి ఏపీలో ఎన్నికలు జరగనుండడంతో ఇప్పుడే ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడని విశ్లేషకులు చెబుతున్నారు. కాగా ఎంతో ప్రతిభ ఉన్న రాయుడు రాజకీయాల వల్ల లేటు వయసులో టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు. అయితే 2019 వరల్ట్ కప్‌కు తన పేరును సెలెక్టర్లు ప్రకటించకపోవడంతో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అనంతరం ఐపీఎల్‌లో మాత్రం కొనసాగాడు. ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడి తన వంతు పాత్ర పోషించాడు.
Read Also:
1. తాడేపలి సీఎం క్యాంపు కార్యాలయంలో అంబటి రాయుడు.. వైసీపీలోకి పక్కా?
2. జీఎస్ఎల్వీ-ఎఫ్12 రాకెట్ ప్రయోగం సక్సెస్
Follow us on: Google News, Koo, Twitter