జీఎస్ఎల్వీ-ఎఫ్12 రాకెట్ ప్రయోగం సక్సెస్

-

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన జీఎస్ఎల్వీ-ఎఫ్12(GSLV F12) ప్రయోగం విజయవంతం అయింది. నిరంతరాయంగా 27:30 గంటల పాటు కొనసాగిన కౌంట్ డౌన్ అనంతరం శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి సోమవారం ఉదయం 10:42 గంటలకు జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌12(GSLV F12) వాహకనౌక ఎన్‌వీఎస్‌-01 ఉపగ్రహాన్ని నింగిలోకి మోసుకెళ్లింది. ఉపగ్రహం విజయవంతంగా కక్ష్యలో ప్రవేశించిందని ప్రయోగం అనంతరం ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ ప్రకటించారు. భారతదేశానికి చెందిన రోండో తరం నావిక్ ఉపగ్రహాల్లో ఎన్‌వీఎస్‌-01 మొదటిది. దీని బరువు 2,232 కిలోలు. 12 సంవత్సరాల పాటు దేశీయ నేవిగేషన్ సేవలు అందించేలా శాస్త్రవేత్తలుఈ ఉపగ్రహాన్ని రూపొందించారు. ఈ ప్రయోగం సక్సెస్ కు కారణమైన శాస్త్రవేత్తలను ఇస్రో చైర్మన్ అభినందించారు. త్వరలో నావిక్ పేరుతో దేశీయ నావిగేషన్ సేవలు అందుబాటులోకి తీసుకువస్తామని వెల్లడించారు.

Read Also:
1. కొత్త పార్లమెంట్లో ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు
2. పవన్ కళ్యాణ్ షూటింగ్ సెట్‌లో అగ్నిప్రమాదం
Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

మహిళను కొట్టిన కాంగ్రెస్ అభ్యర్థి.. తీవ్రంగా స్పందించిన కేటీఆర్..

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా జరుగుతోంది. గెలుపే లక్ష్యంగా అన్ని...

బీఆర్ఎస్ పార్టీకి మాజీ ఎంపీ రాజీనామా

బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే చాలా మంది కీలక...