TSPSC ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్(Bandi Sanjay) మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పేపర్ లీకేజ్‌ను వ్యవహారంపై సిట్‌తో కాదు సిట్టింగ్ హైకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ‘నేను లేనప్పుడు సిట్ అధికారులు నా ఇంటికి వచ్చి నోటీసులు అంటించిపోయారు. ఈ రోజు స్వయంగానే నేనే అధికారులను పిలిచి నోటీసులు తీసుకున్నాను. ఈ విషయంపై నా లీగల్ టీమ్ నిర్ణయం తీసుకుంటుంది. సిట్ విచారణతో అసలు దొంగలను కాపాడే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తోంది’ అని బండి సంజయ్(Bandi Sanjay) ఆరోపించారు. పేపర్ లీకేజీలో మొదట ఇద్దరు మాత్రమే ఉన్నారని చెప్పిన కేటీఆర్.. ఇప్పుడు 20 మందికి ఎందుకు నోటీసులు ఇచ్చారంటూ బండి సంజయ్ ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై బాధ్యత వహిస్తూ.. కేటీఆర్ రాజీనామా చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి ఇకపై భయమంటే ఏంటో చూపిస్తామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Read Also: ఆ తర్వాతే ఎన్నికలకు వెళ్తాం: కేటీఆర్
Follow us on: Google News, Koo, Twitter