స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి(Pocharam Srinivas Reddy), మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి(Gutha Sukender Reddy)లపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్(Bandi Sanjay) తీవ్ర విమర్శలు చేశారు. రాజ్యాంగ పదవిలో ఉంటూ ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ ఓపెనింగ్‌కు వెళ్లడం సిగ్గు చేటని మండిపడ్డారు. రాజ్యాంగాన్ని కాపాడాల్సిన వ్యక్తులు, ఏ పార్టీకి అనుకూలంగా వ్యతిరేకంగానూ వ్యవహరించకూడదన్నారు. పెద్దన్న పాత్ర పోషించి రాజకీయాలకు అతీతంగా పనిచేయాలని సూచించారు. కానీ, తెలంగాణలో స్పీకర్, మండలి ఛైర్మన్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ధ్వజమెత్తారు. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ఖర్చు పెడుతున్న ప్రతీ పైసా కేసీఆర్ ఇచ్చినవేనన్నారు. కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే కేసీఆర్(KCR) మహారాష్ట్రలో ప్రచారం చేయడమేంటని ప్రశ్నించారు. కేసీఆర్ ఇండియాలో ఎన్నికలు వస్తే పాకిస్తాన్‌లో ప్రచారం చేస్తారని బండి(Bandi Sanjay) ఎద్దేవా చేశారు. కేసీఆర్ ఎక్కడికెళ్లిన చేసేదేం లేదన్నారు.
Read Also: ఆంధ్రప్రదేశ్‌లో 175 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ పోటీ
Follow us on: Google News, Koo, Twitter