‘మోడీ సభకు వస్తే కేసీఆర్‌కు గజమాలతో సన్మానం చేస్తా’

-

ప్రధాని నరేంద్ర మోడీ రాక నేపథ్యంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు సీఎం కేసీఆర్ రావాలని బండి సంజయ్(Bandi Sanjay) బహిరంగంగా ఆహ్వానించారు. సభకు కేసీఆర్ వచ్చి.. రాష్ట్ర సమస్యలు ప్రధాని దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. మఖ్యమంత్రి కేసీఆర్‌కు తెలంగాణ అభివృద్ది కావాలా..? లేక రాజకీయాలు కావాలో తెల్చుకోవాలని సవాల్​విసిరారు. తెలంగాణలో అభివృద్ది కార్యక్రమాలకు ప్రధాన మంత్రి వస్తుంటే అడ్డుకోవాలని పిలుపునిస్తే ముఖ్యమంత్రి కేసీఆర్​తెలంగాణ వాదే కాదని అన్నారు.

- Advertisement -

తెలంగాణ అభివృద్దికి మోడీ వస్తుంటే.. తెలంగాణ అభివృద్ధికి మోడీ(Modi) సహకరిస్తుంటే అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నాదని సంజయ్ అన్నారు. తెలంగాణ అభివృద్ధి విషయంలో ఏమైనా చిత్తశుద్ధి ఉంటే రేపు తెలంగాణలో జరిగే మోడీ సమావేశానికి హాజరుకావాలని అన్నారు. మోడీ సమావేశానికి వస్తే మోడీతో కేసీఆర్‌(KCR)కు గజమాల వేసి సన్మానం చేయిస్తానని సంజయ్(Bandi Sanjay) అన్నారు. కేసీఆర్ కంపెనీలు మూసి వేస్తే మోడీ తెరిపిస్తున్నారని బండి సంజయ్ అన్నారు.

Read Also: ‘బాలింతలను పొట్టన పెట్టుకోవడమే అభివృద్ధా?’

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TTD | తిరుమల అన్నప్రసాదాలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత...

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...