బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్(Bandi Sanjay), మంత్రి కేటీఆర్(KTR) మధ్య ట్విట్టర్ వార్ కొనసాగుతోంది. సీఎం కేసీఆర్ ఫ్యామిలీని ఉద్దేశించి బండి సంజయ్ చేసిన ఆరోపణలకు మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం హామీలను మోడీ ప్రభుత్వం దారుణంగా ఉల్లంఘించిందని కేటీఆర్ ట్విట్టర్లో విమర్శించారు. దీనికి వెన్నెముక లేని తెలంగాణ బీజేపీ ఎంపీలు బాధ్యత వహించాలన్నారు. తెలంగాణకు కోచ్ ఫ్యాక్టరీ నిరాకరించిన ప్రధాని మోడీ సొంత రాష్ట్రం గుజరాత్‌కు రూ. 20 వేల కోట్ల లోకోమోటివ్ కోచ్ ఫ్యాక్టరీ కేటాయించారని విమర్శించారు.
గుజరాతీ బాస్‌ల చెప్పులు మోసే దౌర్బాగ్యులను ఎన్నుకున్న ఫలితంగా తెలంగాణకు ఈ దుస్థితి నెలకొందన్నారు. తెలంగాణలో ఆ దిక్కుమాలిన పార్టీ ఎందుకుండాలని ప్రశ్నించారు. దానికి బండి సంజయ్(Bandi Sanjay) స్పందిస్తూ.. నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేసిన వ్యక్తి కేసీఆర్(KCR) అని ఫైరయ్యారు. డబుల్ బెడ్రూం ఇండ్లు, దళితబంధు, పంచాయతీ, మున్సిపాలిటీలకు నిధులు, ప్రకటనలే తప్ప ఆలయాలకు సైతం నిధులు ఇవ్వని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది సీఎం కేసీఆర్ మాత్రమేనని బండి సంజయ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి తన ప్రధాన బాధ్యతల్లో ప్రజలకు చోటివ్వన్నప్పుడు ప్రజలు మాత్రం అతడిని ఎందుకు భరించాలని సంజయ్ ప్రశ్నించారు. ఎందుకు సహించాలో సీఎం సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
Read Also: ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బిగ్ షాక్.. ముంబైలో కేసు నమోదు
Follow us on: Google News, Koo, Twitter