దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు(Raghunandan Rao) సంచలన వ్యాఖ్యలు చేశారు. అధ్యక్షుడు బండి సంజయ్ మార్పుపై గత కొన్ని రోజులుగా మీడియాలో వస్తున్న వార్తలన్నీ నిజమేనని స్పష్టం చేశారు. పదేండ్ల నుంచి పార్టీకి సేవలందిస్తున్నా.. తాను అధ్యక్ష పదవికి అర్హుడిని కాదా? అని ప్రశ్నించారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పార్టీలో తనకు సరైన గుర్తింపు ఇవ్వాలని, మూడు పదవుల్లో ఏదో ఒక పదవి ఇవ్వాలని రఘునందన్ రావు డిమాండ్ చేశారు. అధ్యక్ష పదవికి తాను అర్హుడిని కానా..? పార్టీ అధ్యక్ష పదవి, ఫ్లోర్ లీడర్‌లో ఏదో ఒకటి పదవి ఇవ్వాలి. జాతీయ అధికార ప్రతినిధి ఇచ్చినా తనకు ఓకే అని చెప్పారు. గత పదేండ్ల నుంచి పార్టీ కోసం పని చేస్తున్నానని గుర్తుచేశారు. కొన్ని విషయాల్లో తన కులమే తనకు శాపం కావొచ్చు అని ఆవేదన వ్యక్తం చేశారు.
రెండు నెలల్లో బీజేపీ ఎలా ఉంటుందో అందరికీ తెలుస్తుందని షాకింగ్ కామెంట్స్ చేశారు. బండి సంజయ్‌ది స్వయంకృతాపరాథం అని ఆయన అన్నారు. సంజయ్(Bandi Sanjay) పుస్తెలమ్మి ఎన్నికల్లో పోటీ చేశారు. అలాంటి సంజయ్ వంద కోట్లతో యాడ్స్ ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. తరుణ్ చుగ్, సునీల్ బన్సల్ బొమ్మలతో ఓట్లు రావు అని చెప్పారు. రఘునందన్(Raghunandan Rao), ఈటల రాజేందర్(Eatala Rajender) బొమ్మలతోనే ఓట్లు వస్తాయన్నారు. తాను గెలిచినందుకే ఈటల పార్టీలోకి వచ్చారు. పదేండ్లలో పార్టీ కోసం తనకంటే ఎక్కువ ఎవరూ కష్టపడలేదు. సేవకు ప్రతిఫలం రాకపోతే నడ్డా(JP Nadda)పై మోడీకి ఫిర్యాదు చేస్తానని రఘునందన్ రావు పేర్కొన్నారు.
Read Also:
1. తెలంగాణ కాంగ్రెస్ నేతలు అవకాశవాదులు: మంత్రి పువ్వాడ
2. మీరు 10 ఇస్తే మేము 80 ఇస్తాం: రేవంత్ రెడ్డి
Follow us on: Google News, Koo, Twitter, ShareChat