నేడు సీఎం కేసీఆర్ 4 జిల్లాల పర్యటన

CM KCR

సీఎం కేసీఆర్(CM KCR) నేడు నాలుగు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు దెబ్బతిన్న పంట నష్టాన్ని పరిశీలించనున్నారు. ఖమ్మం, వరంగల్, కరీంనగర్, మహబూబాబాద్ జిల్లాల్లో పంట నష్టాన్ని పరిశీలించి రైతులతో భేటీ కానున్నారు. ఉదయం 10 గంటలకు ప్రగతి భవన్ నుండి బయలుదేరనున్నారు. 11.15 గంటలకు ఖమ్మం జిల్లా బోనకల్ మండలం రామాపురం గ్రామానికి చేరుకొని పంట నష్టాన్ని పరిశీలించనున్న కేసీఆర్.

11:45 గంటలకు రామాపురం నుండి బయలుదేరి 12:10 గంటలకు మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం రెడ్డికుంట తండాకు చేరుకోనున్నారు. 12: 40 గంటలకు రెడ్డికుంట తండా నుండి బయలుదేరి 12:55 గంటలకు వరంగల్ జిల్లా మండలం దుగ్గొండి మండలం అడవి రంగాపురం గ్రామానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 1:30 అడవిరంగాపురం నుండి బయలుదేరి 1:55 గంటలకు కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మి పురం, రామచంద్ర పురం గ్రామాలలో పర్యటించనున్నారు. 2:30 గంటలకు లక్ష్మీపురం గ్రామం నుండి బయలుదేరి 3:30 గంటలకు తిరిగి ప్రగతి భవన్ కు చేరుకుంటారు.

సీఎం కేసీఆర్(CM KCR) పర్యటన నేపథ్యంలో ఆయా జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. సీఎం టూర్ లో ఎలాంటి ఆటంకాలు జరగకుండా ముందస్తుగా విపక్ష నేతలను అరెస్ట్ చేస్తున్న పోలీసులు.

Read Also: మళ్లీ రెండు రోజులపాటు వర్షాలు పడే చాన్స్

Follow us on: Google News  Koo

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here