Jana Reddy |ఎన్నికలు సమీపిస్తోన్న వేళ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీరియర్ లీడర్, కేంద్ర మాజీ మంత్రి జానారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని బలహీన పరిచేందుకే బీజేపీ పనిచేస్తోందని మండిపడ్డారు. తద్వారా ఈ దేశంలో అధికారాన్ని శాశ్వతం చేసుకోవాలని బీజేపీ కలలు కంటోందని కానీ అది ఎన్నటికీ సాధ్యం కాదని ఎద్దేవా చేశారు. పార్లమెంట్‌లో కేవలం అదానీ(Adani), మోడీ(Modi)ల కుట్రలను బయటపెట్టినందుకే రాహుల్ గాంధీ(Rahul Gandhi)పై కేంద్రం కక్ష్య కట్టిందని విమర్శించారు. బీజేపీని వ్యతిరేకించే క్రమంలో అవసరం అయితే ఇతర పార్టీలతో కలిసి పని చేసేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పొత్తు తప్పదు అనుకుంటే అది ప్రజలే నిర్ణయిస్తారని అన్నారు.
బీజేపీ(BJP)ని ఎదుర్కొనేందుకు అన్ని పార్టీలతో కలిసి పని చేస్తామని చెప్పారు. బీజేపీ నియంతృత్వ పోకడలను అడ్డుకునేందుకు, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అన్ని పార్టీలతో కలిసి పోరాటం చేయడానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉందన్నారు. పొత్తుల అంశాన్ని జాతీయ స్థాయిలో హైకమాండ్ నిర్ణయిస్తుందని జానా(Jana Reddy) స్పష్టం చేశారు. బీజేపీపై పోరుకు ఎన్నికలకు సంబంధం లేదన్నారు. ఏయే పార్టీలతో కలిసి పని చేయబోతున్నామనేది అధిష్టానం ముందుగానే తమకు తెలియజేస్తుందని చెప్పారు. బీజేపీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని నియంతృత్వ పాలన సాగిస్తోందని ధ్వజమెత్తారు. కేవలం పెట్టుబడుదారులకు వత్తాసు పలుకుతూ విపక్షాలను అణగదొక్కుతోందని మండిపడ్డారు.
Read Also: కేసీఆర్‌ను ఎందుకు భరించాలి.. ఎందుకు సహించాలి
Follow us on: Google News, Koo, Twitter