కేంద్రంలోని బీజేపీ సర్కా్ర్‌పై సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు(Kunamneni Sambasiva Rao) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ముషీరాబాద్‌లోని సీపీఐ కార్యాయంలో వామపక్ష నేతు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ఒక నయా ఫాసిస్టు ప్రభుత్వంగా మారిందని అన్నారు. మోడీ దిగజారి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ఎన్నికల అఫిడవిట్‌లో అభ్యర్థి వివరాలు పొందు పరచాలి.. మోడీ ఏం చదివాడు అని కేజ్రీవాల్ అడిగారు. దానికి వివరాలు ఇవ్వకుండా కేజ్రీవాల్‌కు రూ.25 వేల జరిమానా వేయడం ఏంటి’’ అని ప్రశ్నించారు. మోడీ ప్రభుత్వం ఎంత అప్రజాస్వామికంగా, వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారు అనేది అర్ధం అవుతుందని తెలిపారు.
సీబీఐతో ప్రతిపక్షాలను వేధిస్తూ.. పైశాచిక ఆనందం పొందుతున్నారని అన్నారు. బీజేపీ వాళ్లు అధికారంలో లేనప్పుడు ఒకలా, అధికారంలోకి వచ్చాక ఒకలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బీజేపీ(BJP) గెలిచింది కేవలం 8 రాష్ట్రాల్లోనే అనేది గుర్తుంచుకోవాలని హితవు పలికారు. అంతేగాక, రాష్ట్రంలో జరుగుతున్న పేపర్ లీకేజీల వ్యవహారాలను హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్(BRS), సీపీఐ(CPI), సీపీఎం(CPM)కు 119 నియోజక వర్గాల్లో కేడర్ ఉందని అభిప్రాయపడ్డారు. కమ్యునిస్టు పార్టీలన్నీ ఏకం కావాల్సిన అవసరం వచ్చిందని అన్నారు. బీజేపీపి ఓడించడానికి తాము బీఆర్ఎస్‌తో కలిసి నడుతస్తామని కూనంనేని(Kunamneni Sambasiva Rao) స్పష్టం చేశారు.
Read Also: ‘తెలంగాణలో పరీక్షలు వస్తే ప్రశ్నాపత్రాల లీకేజీల జాతర’
Follow us on: Google News, Koo, Twitter