చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయాన్ని(Bhagyalakshmi Temple) శుక్రవారం ఉదయం బీజేపీ రాష్ట్ర అధ్యకుడు కిషన్ రెడ్డి(Kishan Reddy) సందర్శించారు. ఈ సందర్బంగా కిషన్ రెడ్డితో పాటు బీజేపీ ఎలక్షన్ కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్, ఎమ్మెల్యే రఘునందన్ రావు(Raghunandan Rao)లు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మహా హారతిలో పాల్గొన్నారు. ఆలయాన్ని సందర్శించిన కిషన్ రెడ్డితో పాటు బీజేపీ నేతలను ఆలయ ట్రస్టీ చైర్మన్ శశికళ బృందం శాలువాతో ఘనంగా సత్కరించింది. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ బండ కార్తీక రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు చింతల రామ చంద్రారెడ్డి, పాశం సురేందర్, అందెల శ్రీ రాములు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.