బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్(Bandi Sanjay)పై మంత్రి కేటీఆర్(KTR) సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. బండి సంజయ్ ఒక అజ్ఞాని అని.. ఆయన అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్(Vizag Steel Plant)ను ప్రైవేటుపరం చేసి కార్మికుల పొట్ట కొట్టాలని చూస్తున్న మోడీ(Modi)ని విమర్శించాల్సింది పోయి.. రాష్ట్ర ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను అదానీ(Adani)కి అప్పగించాలని మోడీ కుట్ర చేస్తున్నాడని కేటీఆర్(KTR) ఆరోపించారు.
ఏపీ పునర్విభజన చట్టం(AP Bifurcation Act)లో బయ్యారం, కడపలో ఉక్కు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినట్లు గుర్తుచేశారు. కానీ, బీజేపీ(BJP) అధికారంలోకి వచ్చాక వాటిని తుంగలో తొక్కిందని మండిపడ్డారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలుగు రాష్ట్రాలకు ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తుందని అన్నారు. బీజేపీ కుట్రలను ప్రజల ముందు ఎండగడతామని స్పష్టం చేశారు. కేంద్రం ఎన్ని డ్రామాలు ఆడినా లాభం ఉండదన్నారు. సీఎం కేసీఆర్ నిజాం షుగర్ ఫ్యాక్టరీ(Nizam Sugar Factory)పై అసెంబ్లీలో ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉన్నామని.. మహారాష్ట్ర మాదిరిగా రైతులు ముందుకొస్తే నడుపుతామని అన్నారని.. ముందుకొస్తే కంపెనీని అప్పగిస్తామని వెల్లడించారు.
Read Also: ‘రాష్ట్రానికి పట్టిన దరిద్రం ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబే’
Follow us on: Google News, Koo, Twitter