ఢిల్లీ లిక్కర్ స్కామ్: MLC Kavitha సంచలన వ్యాఖ్యలు

-

MLC Kavitha Comments On Delhi Liquor Scam |ఢిల్లీ మద్యం కుంభకోణం వ్యవహారంపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఏ తప్పూ చేయలేదని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్‌ను రాజకీయంగా ఎదుర్కొనే దమ్ములేక తనపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను ప్రశ్నించిన రాష్ట్ర ప్రభుత్వాలను హింసించడానికి దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకుంటోందని మండిపడ్డారు. తనను టార్గెట్‌ చేసినంత మాత్రాన భయపడబోనని, అరెస్ట్ చేసినా ఒరిగేదేం లేదని అన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, అన్నీ ప్రజాకోర్టులో తేల్చుకుంటానని అన్నారు.

- Advertisement -

ప్రజలను మభ్యపెట్టేందుకే లిక్కర్ కేసును తెరపైకి తీసుకువస్తున్నారని తెలిపారు. తనను, తనకు సంబంధించిన వారిని అరెస్ట్ చేయడం వల్ల బీజేపీ(BJP)కే నష్టమని అభిప్రాయపడ్డారు. డైరెక్ట్‌గా కేసీఆర్‌ను ఎదుర్కోలేక తనను అడ్డం పెట్టుకొని డ్రామాలు ఆడుతున్నారని అన్నారు. దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారని, ఆ సంస్థలు ఏం చేయాలో ముందే బీజేపీ నేతలు చెబుతున్నారని, వాళ్లు చెప్పాక వాటికే దర్యాప్తు సంస్థలు అమలు చేస్తున్నాయని ఆరోపించారు. దేశంలో మోడీని ఎదుర్కొనే సత్తా కేవలం కేసీఆర్‌(KCR)కు మాత్రమే ఉందని, దేశ ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని కవిత(MLC Kavitha) తెలిపారు.

Read Also:

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...