TS: పోలీసు అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. ‘కీ’ విడుదలపై అధికారిక ప్రకటన

-

Telangana |తుది పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న తెలంగాణ పోలీసు అభ్యర్థులకు తెలంగాణ పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు(Telangana Police Recruitment Board) కీలక ప్రటన చేసింది. ఎస్ఐ, ఏఎస్ఐ పోస్టుల మెయిన్స్ పరీక్ష ప్రాథమిక ‘కీ’ రేపు(మే 11న) విడుదల చేయనున్నారు. 587 పోస్టులకు మార్చిలో పరీక్షలు నిర్వహించారు. తాజాగా ఈ పరీక్షల ఫలితాలకు సంబంధించిన ‘కీ’ని విడుదల చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. ‘కీ’ విడుదలైన తర్వాత అభ్యంతరాలుంటే ఈ నెల 14 సాయంత్రం 5 గంటలలోపు తెలపాలని అధికారులు సూచించారు. కాగా, 587 పోస్టులకు తొలుత 2 లక్షల 47 వేల 630 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. దేహదారుఢ్య పలితాల తర్వాత వీరిలో 59 వేల 574 మంది మిగిలారు. వీరంతా పరీక్షలు రాశారు. సామాజిక వర్గాల వారీగా కటాఫ్ మార్కుల ఆధారంగా ఈ పోస్టులను కేటాయించనున్నారు. ఈ మేరకు పరీక్షల కీని గురువారం విడుదల చేయనునున్నారు.

- Advertisement -
Read Also: మాలాంటి ముసలి వాళ్ళను చూసి యువత నేర్చుకోవాలి -సుధామూర్తి

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TTD | తిరుమల అన్నప్రసాదాలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత...

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...