టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్(TSPSC Paper Leak) అంశంలో సిట్ అధికారులు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ కేసుపై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల(YS Sharmila) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనిపై శుక్రవారం బేగంబజార్ పోలీస్ స్టేషన్‌లో ఆమె ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. పేపర్ లీక్ కేసులో ఐటీ శాఖ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ఒక ఐపీ అడ్రస్, పాస్ వర్డ్ తెలిసినంత మాత్రానా పేపర్ లీక్ చేయొచ్చా అని ప్రశ్నించారు. ఎవరు పడితే వాళ్లు సిస్టమ్ యాక్సిస్ ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. ఈ కేసులో ఐటీ శాఖ వైఫల్యంపై దర్యాప్తు చేయాలన్నారు. ఐటీ శాఖ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికే సిట్‌తో దర్యాప్తు చేస్తున్నారని ఆరోపించారు. ఐటీ శాఖ వైఫల్యంపై మంత్రి కేటీఆర్(KTR) బాధ్యత వహించాలన్నారు. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌పై కేసు ఫైల్ చేయాలని షర్మిల(YS Sharmila) డిమాండ్ చేశారు.
Read Also: TSPSC పేపర్ లీకేజీ కేసులో మరో ఇద్దరు అరెస్ట్
Follow us on: Google News, Koo, Twitter