పవన్ వ్యాఖ్యల్లో అర్ధమే లేదు…చంద్రబాబు హాట్ కామెంట్స్

-

కడపలో ఉక్కు ఫ్యాక్టరీని ఏర్పాటుచేయాలని నిరాహార దీక్ష చేస్తోన్న సీఎం రమేశ్‌ను శనివారం నాడు ఏపీ ముఖ్యమంత్రి పరామర్శించారు. శనివారం ఉదయం కడప చేరుకున్న చంద్రబాబు, టీడీపీ ఎంపీ ఆరోగ్యం ఆందోళనకరంగా మారడంతో ఆయనకు నచ్చజెప్పి నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు.

- Advertisement -

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. స్టీల్ ప్లాంట్ కోసం దీక్షను చేపట్టిన సీఎం రమేష్, బీటెక్ రవిలను అభినందించారు. మీరు చేపట్టిన దీక్ష యావత్ దేశం దృష్టిని ఆకర్షించిందని ప్రశంసించారు. మీరు చేసిన దీక్షలు వృథాగా పోవని, కడప ఉక్కు పరిశ్రమ మీ వల్లే వచ్చిందనే విషయం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని బాబు వ్యాఖ్యానించారు.

వైసీపీ, జనసేన, బీజేపీలపై చంద్రబాబు విమర్శలు గుప్పించారు. బీజేపీకి ఓ వైపు జనసేనాని పవన్ కల్యాణ్, మరోవైపు వైసీపీ అధినేత జగన్‌లు ఉన్నారంటూ సీఎం చంద్రబాబు ఎద్దేవా చేశారు. అలాగే ఉత్తరాంధ్రలో ప్రత్యేక రాష్ట్రం ఉద్యమం కోసం పోరాడతానంటోన్న పవన్ మాటల్లో ఏమైనా అర్థం ఉందా అని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Gold Rates | రూ. లక్ష మార్క్ చేరుకోనున్న బంగారం ధర!!

దేశంలో బంగారం ధరలు(Gold Rates) పరుగులు పెడుతున్నాయి. మధ్యమధ్యలో స్వల్పంగా తగ్గుతూ...

Chandrababu | కార్యకర్తల్ని ఉద్దేశించి చంద్రబాబు ఎమోషనల్ స్పీచ్

టీడీపీ అభిమానులు పార్టీ ఆవిర్భావ వేడుకలను రెండు రాష్ట్రాల్లోనూ ఘనంగా నిర్వహిస్తున్నారు....