అరవింద సామెత లో బిగ్ బాస్ కంటెస్టెంట్

అరవింద సామెత లో బిగ్ బాస్ కంటెస్టెంట్

0
107

జూ.ఎన్టీఆర్ కొత్త సినిమా అరవింద సమేత వీర రాఘవ.ఈ చిత్రంలో ని అతిధి పాత్రలో బిగ్‌బాస్1 కంటెస్టెంట్ ఆదర్శ్ బాలకృష్ణ నటిస్తున్నాడు. ఈ సందర్భంగా సెట్స్‌లో త్రివిక్రమ్, ఎన్టీఆర్‌లతో కలిసి దిగిన ఫొటోను ఆదర్శ్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశాడు.

‘అతిధి పాత్రలో నటిస్తున్నప్పటికీ.. ఎన్టీఆర్, త్రివిక్రమ్ లతో కలిసి పనిచేయాలన్న తన కల నిజమైందని తన ట్వీట్లో పేర్కొన్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ శివార్లలో జరుగుతోంది. ఈ చిత్రంలో పూజా హెగ్డే, ఈశా రెబ్బా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు.