సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న బాలకృష్ణ

సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న బాలకృష్ణ

0
40

బాలయ్య రెండుసార్లు సీఎం అవ్వడం ఏమిటి అనుకుంటున్నారా ? సీఎం అయ్యేది రియల్ లైఫ్ లో కాదులేండి రీల్ లైఫ్ లో. విషయంలోకి వెళ్తే నందమూరి బాలకృష్ణ ప్రధానపాత్రను పోషించడమే కాకుండా ఎంతో ప్రతిష్టాత్మకంగా తన తండ్రి విశ్వ విఖ్యాత నటసార్వభౌమ నటరత్నఎన్టీఆర్ జీవితం కథను చిత్రంగా నిర్మిస్తున్నారు. జూలై 5 నుంచి శరవేగంగా షూటింగ్ జరుపుకొని మొదటి షెడ్యూల్ ను విజయవంతంగా పూర్తి చేసుకుంది ఈ చిత్రం. కాగా ఈ చిత్రంలో బాలయ్య రెండుసార్లు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

ఎన్టీఆర్ మొదటి సారి అఖండ విజయం సాధించి సీఎం అయ్యే సందర్భం ఒకటి కాగా, నాదండ్ల భాస్కరరావుని సీఎంగా దించిన తర్వాత మళ్ళీ ఎన్టీఆర్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే సందర్భం ఒకటి. ఈ రెండు సందర్భాలు ఎన్టీఆర్ బయోపిక్ లో ముఖ్యమైన సన్నివేశాలుగా చూపించనున్నారు. ఈ సన్నివేశాల్లోనే బాలయ్య రెండు సార్లు సీఎంగా కనిపించనున్నారు.

ఈ చిత్రంలోని ముఖ్యమైన పాత్రల కోసం ఇప్పటికే విద్యాబాలన్ ను, రానాను, సచిన్ కేడెకర్ ను, మోహన్ బాబును, సుమంత్ లతో పాటుగా అతిధి పాత్రల్లో మరికొంతమంది ప్రముఖ నటీనటులు నటిస్తుండటం విశేషం. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. బుర్రా సాయిమాధవ్‌ మాటలు అందిస్తున్న ఈ చిత్రానికి ఎం.ఎం. కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. సాయి కొర్రపాటి, విష్ణు సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.