భారీగా అమ్ముడుపోయిన అరవింద సమేత శాటిలైట్ రైట్స్

భారీగా అమ్ముడుపోయిన అరవింద సమేత శాటిలైట్ రైట్స్

0
59

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో హారికా, హాసిని బ్యానర్‌పై రాధాకృష్ణ రూపొందిస్తున్న ‘అరవింద సమేత’ వీర రాఘవ అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. నేపథ్యంలో త్రివిక్రమ్, ఎన్టీఆర్ కాంబినేషన్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అంచనాలకు తగినట్టే ఈ చిత్రాన్ని పక్కా యాక్షన్, ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్నారు. మాస్‌ క్యారెక్టర్‌లో ఎన్టీఆర్ ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

తాజాగా ఈ చిత్రం శాటిలైట్ హక్కులు రికార్డు ధరకు అమ్ముడుపోయాయనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. “అరవింద సమేత” శాటిలైట్ హక్కులను “జీ తెలుగు” ఛానెల్ రూ. 23.5 కోట్లకు సొంతం చేసుకుందట. అయితే ఇప్పటివరకు ఎన్టీఆర్ నటించిన ఏ చిత్రం హక్కులు ఇంత మొత్తానికి అమ్ముడు కాలేదు. దీంతో ఇది ఎన్టీఆర్ కెరీర్ లోనే అతిపెద్ద శాటిలైట్ డీల్ అని చెప్తున్నారు సినీ విశ్లేషకులు. అంతేకాదు “బాహుబలి-2” తరువాత భారీ ధరకు అమ్ముడు పోయిన రెండవ చిత్రంగా “అరవింద సమేత” రికార్డు సృష్టించింది. మరోవైపు చిత్ర డిస్ట్రిబ్యూషన్ హక్కుల ద్వారానే రూ.80 కోట్ల బిజినెస్ జరుగుతుందని నిర్మాతలు భావిస్తున్నారట. జై లవకుశతో మంచి కలెక్షన్లు సాధించిన ఎన్టీఆర్ ఇక ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేసే దిశగా అడుగులేస్తున్నాడు. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌తో వస్తున్న యంగ్ టైగర్ ఈ చిత్రంలో సిక్స్‌ప్యాక్ బాడీతో అలరించనున్నారు. ఎన్టీఆర్ సరసన అందాల తార పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుంది.