పవన్ కు సవాల్ విసిరిన లోకేష్

పవన్ కు సవాల్ విసిరిన లోకేష్

0
125

పవన్ కల్యాణ్ గత కొద్దిరోజులగా టీడీపీ ప్రభుత్వం కొందరు మంత్రులపై మాటల యుద్ధం చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా పవన్‌ చేసిన వ్యాఖ్యలపై మంత్రి నారా లోకేశ్ స్పందించి కౌంటరిచ్చారు. పవన్‌కు దమ్ము, ధైర్యం ఉంటే కేంద్రాన్ని నిలదీయాలని లోకేశ్ ఛాలెంజ్ చేశారు. పవన్‌ తన సవాళ్లను ఎదుర్కొనలేకపోయారని ఆయన చెప్పుకొచ్చారు. ఇంతక మునుపు టీడీపీ అవినీతిని నిరూపించాలంటూ లోకేశ్.. పవన్‌కు సవాల్ విసిరిన విషయం విదితమే.

అంతటితో ఆగని నారా లోకేశ్.. వైసీపీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డిపై విమర్శల వర్షం కురిపించారు. జగన్ ప్రతిపక్ష నేత కాదని.. అవినీతి పుత్రుడని లోకేశ్ వ్యాఖ్యానించారు. రాష్ట్ర సమస్యల పరిష్కారానికి ప్రత్యేక హోదాయే సంజీవిని అని మంత్రి స్పష్టం చేశారు. కాగా లోకేశ్ వ్యాఖ్యలపై జనసేన, వైసీపీ నుంచి ఎలాంటి స్పందన వస్తుందో వేచి చూడాల్సిందే మరి.