బాలీవుడ్ కి ఎంట్రీ ఇవ్వనున్న అక్కినేని కుర్రాడు

బాలీవుడ్ కి ఎంట్రీ ఇవ్వనున్న అక్కినేని కుర్రాడు

0
91

అక్కినేని అఖిల్ అఖిల్ సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టాడు . తొలి సినిమాతో నిరాశపరిచిన అఖిల్, రెండో ప్రయత్నంగా తెరకెక్కిన హలో సినిమాతో ఓకే అనిపించుకున్నాడు. ప్రస్తుతం తొలి ప్రేమ ఫేం వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఓ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌లో చిత్రంలో నటిస్తున్నాడు. నిధి అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తున్న షూటింగ్ విదేశాల్లో జరుగుతోంది.

తాజాగా అఖిల్ తన తరువాత చిత్రానికి సంబంధించిన ఒక ఆసక్తికర వార్త టాలీవుడ్‌ తెగ చెక్కర్లు కొడుతోంది. అఖిల్‌ తన నెక్ట్స్ సినిమాతో బాలీవుడ్‌ ఎంట్రీకి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. నటుడు ఆది పినిశెట్టి సోదరుడు సత్య ప్రభాస్‌ దర్శకత్వంలో అఖిల్ సినిమా చేస్తున్నాడన్న టాక్‌ చాలా రోజులుగా వినిపిస్తోంది.

సత్య ప్రభాస్‌ మలుపు సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే తరువాత చిత్రంలో అఖిల్ హీరోగా తెలుగు, హిందీ భాషల్లో ఓ సినిమాను తెరకెక్కించేందుకు ప్లాన్‌ చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. కింగ్ నాగార్జున, కరణ్‌ జోహర్‌లు సంయుక్తంగా ఈ సినిమా నిర్మించనున్నారట. ప్రస్తుతానికి అధికారిక ప్రకటన లేకపోయినా, అఖిల్‌ బాలీవుడ్ ఎంట్రీపై జోరుగా ప్రచారం జరుగుతోంది.